: వరుసగా మూడో రోజూ.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

గత రెండురోజుల మాదిరిగానే ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈరోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కొద్ది సేపటికే నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయి 25,032 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 7,750 పాయింట్ల వద్ద క్లోజయింది. ఎన్ఎస్ఈ లో ఐటీసీ సంస్థ షేర్లు అత్యధికంగా 4.05 శాతం లాభపడి రూ.338 వద్ద ముగిశాయి. లాభపడ్డ సంస్థ షేర్లలో అదానీ పోర్ట్స్, టాటా పవర్, ఐడియా, ఓఎన్జీసీ లున్నాయి. లుపిన్ సంస్థ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ఇంకా, షేర్లు నష్టపోయిన సంస్థలలో అంబుజా సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, రిలయన్స్ ఉన్నాయి.

More Telugu News