: అదృశ్యమైన ఈజిప్టు విమాన శకలాలు లభ్యం!

పారిస్ నుంచి కైరోకు వెళుతున్న ఈజిప్ట్ ఎయిర్‌ వేస్‌ కు చెందిన 'ఎంఎస్ 804' విమానం 66 మంది ప్రయాణికులతో మార్గమధ్యంలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ విమానం సముద్రంలో కుప్పకూలే ముందు రెండు సార్లు షార్ప్ టర్న్ తీసుకుని, 7620 మీటర్ల ఎత్తు నుంచి మధ్యదరా సముద్రంలో కుప్పకూలినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో విమానం ఆచూకీ కోసం గత రెండు రోజులుగా గ్రీకు, ఈజిప్ట్, ఫ్రెంచ్, యూకే మిలిటరీ సెర్చ్ ఆపరేషన్‌ లో పాల్గొన్నాయి. రెండు రోజుల శ్రమ అనంతరం ఈజిప్ట్ విమాన శకలాలు అధికారులకు లభ్యమయ్యాయి. ఈ మేరకు ఈజిప్ట్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరానికి ఉత్తరదిశన 290 కిలోమీటర్ల దూరంలో శకలాలను గుర్తించినట్టు తెలిపింది. ప్రయాణికులకు చెందిన వస్తువులు లభ్యమయ్యాయని, విమానం బ్లాక్ బాక్స్‌ కనుగొనేందుకు గాలింపు ముమ్మరం చేసినట్లు వారు వెల్లడించారు.

More Telugu News