: ఫర్వాలేదనిపించిన ఊతప్ప, యూసుఫ్ పఠాన్...గుజరాత్ లక్ష్యం 125

ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా కాన్పూర్ వేదికగా జరిగిన 51వ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు ఆకట్టుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ కు రైనా ఆదిలోనే షాకిచ్చాడు. అద్భుతమైన త్రోతో గౌతమ్ గంభీర్ (8) ను, చక్కని క్యాచ్ తో మనీష్ పాండే (1)ను అవుట్ చేశాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో ఊతప్ప (25), పియూష్ చావ్లా (11) ఆదుకునేలా కనిపించినప్పటికీ వరుసగా ఇద్దరూ అవుటయ్యారు. దీంతో యూసఫ్ పఠాన్ (36) కు జత కలిసిన షకిబల్ హసన్ (3) విఫలమయ్యాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (17), జాసన్ హోల్డర్ (11) మరమ్మతులు ప్రారంభించినా అప్పటికే ఆలస్యమైంది. వీరిద్దరూ అవుట్ కావడంతో కోల్ కతా భారీ స్కోరు సాధించలేకపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 124 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో స్మిత్ నాలుగు వికెట్లతో రాణించగా, కులకర్ణి, జడేజా, జకాటి చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు. 125 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జట్టు తొలి బంతికే స్మిత్ (0) వికెట్ కోల్పోయింది. మెక్ కల్లమ్ (6) కు రైనా (5) జతకలిశాడు.

More Telugu News