: అమ్మకానికి పట్టణం @ 5.01 కోట్లు

ఓ మోస్తరు పట్టణంలో ఇల్లు కట్టాలంటే లక్షలు ఖర్చుచేయాల్సిందే... అదే మెట్రోపాలిటన్ సిటీలో ఓ మోస్తరు సౌకర్యాలున్న ఇల్లు కట్టాలంటే ఇంకా లక్షలకు లక్షలు గుమ్మరించాల్సిందే. ఆ ఇంటినే పేరున్న కనస్ట్రక్షన్ కంపెనీ నుంచి కొనుగోలు చేయాలంటే కోట్లు పెట్టాల్సిందే. కానీ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ నగరానికి దగ్గర్లో అల్లిస్‌ క్రీక్‌ అనే పట్టణం ఉంది. ఒక్కప్పుడు టింబర్‌ డిపోల (కట్టెలమండి) కు ఈ పట్టణం చిరునామాగా ఉండేది. ప్రస్తుతం మూడు కలప మిల్లులు, 16 గృహాలు, విశాలమైన రోడ్లు, ఫుట్‌ పాత్‌ లు, నీటి సరఫరా వ్యవస్థ, సొంతంగా విద్యుత్‌ కేంద్రం, సరస్సులు గల ఈ పట్టణంలో పలు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. తాజాగా ఈ పట్టణాన్ని డొమైన్‌.కామ్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అమ్మకానికి పెట్టింది. ఇన్ని సౌకర్యాలున్న పట్టణం అంటే భారీ ధర అని భావించవద్దని డొమైన్.కామ్ పేర్కొంటోంది. దీని ధర కేవలం 7.5 లక్షల డాలర్లు (5.01 కోట్ల రూపాయలు) గా పేర్కొన్నారు. ఈ పట్టణ యజమానులైన దంపతులు దీనిని గత ఏడాది 2 మిలియన్‌ డాలర్లకు అమ్మకానికి పెట్టగా, దీనిని కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో ఆ ధరను తగ్గించి కేవలం 7.5 లక్షల డార్లకే అమ్మకానికి పెట్టారు. దీంతో ఈ పట్టణాన్ని దక్కించుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు.

More Telugu News