: మాల్యాకు మరో షాక్!... రూ.9.33 కోట్ల డివిడెండ్ ను నిలిపేసిన యూబీ

ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియానికి రూ.9 వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. యునైటెడ్ బ్రూవరీస్ ను విదేశీ కంపెనీకి అమ్మేసుకుని గుట్టుచప్పుడు కాకుండా గుడ్ విల్ తీసుకుని మరీ పారిపోయిన మాల్యాకు యూబీలో ఇంకా కొంత మేర షేర్లు ఉన్నాయి. వీటిపై గత ఆర్థిక సంవత్సరానికి (2015-16) సంబంధించి రూ.9.33 కోట్ల మేర డివిడెండ్ వచ్చిందట. అయితే ఈ మొత్తాన్ని మాల్యాకు చెల్లించడానికి వీల్లేదని బెంగళూరులోని డెబిట్ రికవరీ ట్రైబ్యూనల్ (డీఆర్టీ) కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలతో మాల్యాకు చెల్లించాల్సి ఉన్న రూ.9.33 కోట్ల డివిడెండ్ ను నిలిపివేసినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు.

More Telugu News