: టీమిండియా కోచ్ పదవికి అతనికంటే మంచి ఆప్షన్ లేదు: రికీ పాంటింగ్

టీమిండియా కోచ్ పై గత కొంతకాలంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. టీమిండియా దిగ్గజాలు, బీసీసీఐ ప్రత్యేక సలహాదారులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ ముక్తకంఠంతో ద్రవిడ్ పేరును ప్రతిపాదించారు. అయితే టీమిండియా కోచ్ గా ఇప్పుడే పగ్గాలు చేపట్టే ఉద్దేశ్యం లేదని ద్రవిడ్ స్పష్టం చేశాడు. దీంతో, టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీ న్యూజిలాండ్ దిగ్గజం డేనియల్ వెట్టోరీని ప్రతిపాదించాడు. దీనిపై తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ, టీమిండియా కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ ద్రవిడ్ సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డాడు. టీమిండియా కోచ్ కు ఉన్న ఆప్షన్లలో ద్రవిడే అత్యుత్తమ ఆప్షన్ అని పాంటింగ్ పేర్కొన్నాడు. 'క్రికెట్ పరంగా ద్రవిడ్ కు విపరీతమైన నాలెడ్జ్ ఉంది. దాంతోపాటు అతనికి క్రికెటర్ గా అనుభవం కూడా ఎక్కువే. ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీకి కోచ్ గా చేస్తున్న ద్రవిడ్ కు మూడు ఫార్మాట్ లపైన మంచి అవగాహన ఉంది. అతను కచ్చితంగా భారత్ కు మంచి కోచ్ కాగలడన్నది నా అభిప్రాయం' అన్నాడు పాంటింగ్.

More Telugu News