: మే 22న ప్రయాణానికి సిద్ధమైన సముద్రంలో 'కదిలే నగరం' లాంటి ఓడ!

ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన 16 అంతస్తులు, విశాలమైన 20 డైనింగ్ రూంలు, 23 స్విమ్మింగ్ పూల్స్, ఓ పార్కు, 10వేల మొక్కలు, 50 వృక్షాలు, 2500 రూములు, వినోదం కోసం ప్రత్యేకంగా థియేటర్లు కలిగిన అతిపెద్ద షిప్ మే 22న తొలి ప్రయాణానికి సిద్ధమవుతోంది. ప్రపంచంలోని పెద్ద నగరం నీటిలో నడుస్తోందా? అనే రీతిలో ఉన్న ఈ నౌకలో 6,360 మంది ప్రయాణించడానికి పూర్తి ఏర్పాట్లు ఉండడం విశేషం. బార్సిలోనా నుంచి మే 22న ఇది తొలి అధికారిక ప్రయాణం చేయనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకగా పేరొందిన ఈ 'హర్మనీ ఆఫ్ ది సీస్' తొలి ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఫ్రెంచ్ షిప్ యార్డ్ లో దీనిని తయారు చేసేందుకు 660 కోట్ల రూపాయలు ఖర్చవగా, 32 నెలల సమయం పట్టింది. ఫ్రాన్స్ లోని వెస్టర్న్ పోర్టు టౌన్ లోని సెయింట్ నజైర్ నుంచి యూకేకు బయలుదేరిన 'హర్మనీ ఆఫ్ ది సీస్'కు వేలాది మంది ఫ్రెంచ్ అభిమానులు వీడ్కోలు పలికారు. దీని ఎత్తు 362 మీటర్లు కావడం విశేషం. టైటానిక్ షిప్ ఆదర్శంగా దీనిని తయారు చేశారు.

More Telugu News