: 17 నెలల తరువాత పెరిగిన ద్రవ్యోల్బణం

దాదాపు 17 నెలల తరువాత టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది. మార్చిలో 3.73 శాతం వద్ద ఉన్న ఇన్ ఫ్లేషన్ సూచిక ఏప్రిల్ లో 4.23 శాతానికి చేరుకుంది. అక్టోబర్ 2014 తరువాత ద్రవ్యోల్బణం పెరుగుదల బాటన నడవడం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తులు ముఖ్యంగా పప్పుధాన్యాల ధర పెరగడం మొత్తం గణాంకాలను ప్రభావితం చేసిందని తెలుస్తోంది. ఈ నెలలో ఉల్లిపాయల ధరలు 18 శాతానికి పైగా తగ్గాయి. తాజా గణాంకాలను బట్టి, ద్రవ్యోల్బణం ఇండెక్స్ లో 65 శాతం వెయిటేజ్ ఉన్న మాన్యుఫాక్చర్డ్ ప్రొడక్టుల సూచిక 0.71 శాతం పెరిగింది. ఈ కేటగిరీలోని షుగర్, ఎడిబుల్ ఆయిల్స్ తదితరాల ధర సగటున 8 శాతానికి పైగా పెరిగింది.

More Telugu News