: రూ. 200 కోట్ల ఆఫర్ ఇచ్చినా తన 'ఐడియా' ఇవ్వనంటున్న బుడ్డోడు!

అమెరికాలో బేస్ బాల్ పోటీలు జరుగుతున్న వేళ, తన స్నేహితులు గాయపడితే, వారికి ప్రాథమిక చికిత్సల కోసం మెడికల్ షాపులకు పరుగులు పెట్టే తల్లిదండ్రులను చూసిన 14 ఏళ్ల టేలర్ రోసెంథాల్ కు వచ్చిన ఓ చిన్న ఆలోచన, అతన్ని వ్యాపార ప్రపంచానికి పరిచయం చేసింది. అతని ఆలోచనను తమకు విక్రయించాలని క్యూ కడుతున్న కంపెనీలెన్నో ఉన్నాయి. రూ. 200 కోట్ల ఆఫర్ ఇచ్చినా టేలర్ తిరస్కరించాడు. ఇక టేలర్ ఐడియా ఏంటో చూద్దామా? చాలా సింపుల్... వివిధ రకాల ఫస్ట్ ఎయిడ్ కిట్ లతో కూడిన ఏటీఎం మెషీన్ ను తయారు చేయడమే. శరీరానికి గాయాలైనా, ఎండలో సొమ్మసిల్లినా, కాలిన గాయాలైనా... ఫస్ట్ ఎయిడ్ కిట్ లను ఈ వెండింగ్ మెషీన్ విక్రయిస్తుంది. సమస్య ఏంటో సెలక్ట్ చేసుకుని, బటన్ ప్రెస్ చేస్తే, అందుకు సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కిట్ బయటకు వచ్చేస్తుంది. ఈ వినూత్న ఆలోచన టేలర్ కు పేరుతో పాటు డబ్బునూ తెచ్చి పెట్టింది. ఈ ఐడియాకు సంబంధించిన హక్కులన్నీ టేలర్, తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడు. రెక్ మెడ్ పేరిట ఓ స్టార్టప్ సంస్థనూ ప్రారంభించాడు. ఒక్కో మెషీన్ ను రూ. 35 లక్షలకు విక్రయిస్తుంటే, ప్రస్తుతం టేలర్ వద్ద 100 మెషీన్లకు ఆర్డర్లు ఉన్నాయట. ఈ విషయాన్ని విన్న ఓ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ టేలర్ ఆలోచనకు రూ. 200 కోట్లు ఇచ్చేందుకు ముందుకు రాగా, ఈ బుడ్డోడు ఒప్పుకోలేదట. తానే తన వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తానని కూడా చెబుతున్నాడట. ఆల్ ది బెస్ట్ టూ టేలర్!

More Telugu News