: మేఘాల్లో తేలాలంటే అర్జెంటీనా వెళ్లాల్సిందే!

మేఘాల్లో తేలిపోతూ హాయిగా విహరించాలనుకునే వారు, తమ ఊహలను సాకారం చేసుకోవడానికి అర్జెంటీనా వెళ్లడం కరెక్టు. ఎందుకంటే, అక్కడి రైలు ప్రయాణం మేఘాల్లో తేలియాడినట్టు ఉంటుంది మరి. భూమికి 4,200 మీటర్ల ఎత్తులో ఆ రైలు మార్గం 217 కిలోమీటర్ల మేర సాగుతుంది. సల్జా నగరం నుంచి లా పొల్వోరిల్లా ప్రదేశానికి వెళ్లే రైలును ట్రైన్ టు ది క్లౌడ్స్ అని పిలుస్తారు. ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన ఇదే. చల్లని గాలి, చూడముచ్చటైన వాతావరణం, పెద్దపెద్ద వంతెనలు, అందమైన గుహల లోపలి నుంచి సుమారు 217 కిలోమీటర్ల దూరం ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. మేఘాలు, స్వచ్ఛమైన గాలి, వాతావరణం, అందమైన ప్రకృతిని ఆస్వాదించి, 4,200 మీటర్ల ఎత్తులో దిగి ఫోటోలు తీసుకుని, తిరుగు ప్రయాణం కావచ్చు. ఒకప్పుడు రవాణా మార్గంగా అవసరాలు తీర్చిన ఈ రైలు మార్గం, ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. ఈ రైలు మార్గంలో ప్రయాణించేందుకు ఔత్సాహికులు ఆసక్తి చూపుతారు.

More Telugu News