: చైనా కుయుక్తితో పాక్ ను ముందుకు తెచ్చినా భారత్ కే మా మద్దతు: స్పష్టం చేసిన అమెరికా

చైనా కుయుక్తిని అమెరికా అర్థం చేసుకుంది. అందుకే చైనా కుట్రపూరితంగా పాకిస్థాన్ ను తెరపైకి తీసుకువచ్చినా వచ్చే నష్టం లేదని అమెరికా చెబుతోంది. భారతదేశానికి అండగా నిలిచేందుకు అమెరికా సిధ్ధంగా ఉంది. చైనా, పాకిస్థాన్ దేశాలు భారత్ ఎన్ఎస్ జీ చేరడాన్ని ఎంత వ్యతిరేకిస్తున్నా భారత్ ఆ బృందంలో చేరడం ఖాయమని అమెరికా స్పష్టం చేస్తోంది. అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌ జీ) లో భారత్ చేరడం ఖాయమని అమెరికా తెలిపింది. ఎన్‌ఎస్‌ జీ బృందంలో భారత్ చేరడాన్ని చైనా వ్యతిరేకించిన కొద్ది గంటల్లోనే అమెరికా మద్దతుగా నిలవడం విశేషం. ఎన్ఎస్ జీలో భారత్ చేరుతుందనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015లోనే చెప్పారంటూ అమెరికా హోంశాఖ ప్రతినిధి జాన్ కిర్బీ గుర్తుచేశారు. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ నిబంధనలను భారత్ పాటిస్తోందని, అదే సమయంలో అంతర్జాతీయ నిబంధనలు భారత్ ఉల్లంఘించిన సందర్భాలు లేవని అమెరికా స్పష్టం చేస్తోంది. దీంతో అణు సరఫరాదారుల బృందంలో చేరడానికి భారత్‌ కు అన్ని అర్హతలు ఉన్నాయని అమెరికా స్పష్టం చేసింది. అదే సమయంలో చైనా, పాకిస్థాన్ దేశాలు భారత్ కు సభ్యత్వం కల్పించడంపై ఆది నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయని గుర్తు చేశారు. భారత్ తో తమకు ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని ఆ రెండు దేశాలు ఇలా ప్రవర్తిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News