: పోతూ పోతూ ముంబైని చావుదెబ్బతీసిన పంజాబ్!

ప్లేఆఫ్ అవకాశాలను చేజార్చుకున్న పంజాబ్ జట్టు గత రాత్రి జరిగిన ఐపీఎల్ పోరులో ముంబైని చావుదెబ్బ తీసింది. ఈ టోర్నమెంటులోనే బలహీనమైన జట్టుగా పేరుపడ్డ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చేతిలో రోహిత్ సేన దారుణంగా ఓడిపోయింది. మరో రెండు మ్యాచ్ లు మాత్రమే ముంబై చేతుల్లో ఉండగా, వాటిల్లో రెండు కచ్చితంగా గెలిస్తేనే ముంబై ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు, పంజాబ్ బౌలర్లు రాణించడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఆపై 125 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టులో హషీమ్ ఆమ్లా డక్కౌట్ అయినా, విజయ్, సాహాలు రాణించడం, స్కోరు తక్కువగా ఉండటంతో పంజాబ్ పని సులువైంది. ఏడు వికెట్ల తేడాతో ఆ జట్టు విజయతీరాలకు చేరడంతో పాటు ముంబైని గట్టి దెబ్బ కొట్టింది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టులో విజయ్‌ 54, సాహా 56, ఆమ్లా 0, మాక్స్‌వెల్‌ 0, గుర్‌కీరత్‌ 6 పరుగులు చేశారు.

More Telugu News