: హాలీవుడ్ సెలబ్రిటీలు చేస్తున్నది ట్రెండ్ కాదు...జెనిటల్ ఫోబియా!

హాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో నగ్న సెల్ఫీలు పెడుతూ అభిమానులను అలరిస్తున్నారు. నగ్నత్వాన్ని బూతుగా చూడవద్దని, అద్భుతమైన ఆర్ట్ లా చూడాలని స్టేట్ మెంట్లు కూడా ఇస్తున్నారు. ఇదో ట్రెండ్ గా మారింది. కిమ్ కర్దాషియన్ మొదలు పెట్టిన ఈ నగ్న సెల్పీ ట్రెండ్ అమె నుంచి ఎమీలీ రటాజ్ కోస్కీ, ఆమె నుంచి మార్నీ సింప్సన్, అక్కడి నుంచి విక్కీ పట్టిసన్, వీరందర్నీ మించి మిలీ సైరస్ ముప్పావు నగ్నంగా ఎంటీవీ అవార్డుల కార్యక్రమానికి హాజరై సెల్ఫీ తీసుకుని సంచలనం రేపింది. అయితే, ఈ చేష్టలన్నీ ట్రెండ్ కాదని, సైకలాజికల్ డిజార్డర్ అని, దీనిని జెనిటల్ ఫోబియా అంటారని లండన్ క్వీన్స్ గైనకాలజీ క్లినిక్ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ అహ్మద్ ఇస్మాయిల్ తెలిపారు. ఇది ముదిరితే ప్రమాదమని, దీనిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని ఆయన తెలిపారు. తోటి వారి సెక్స్, ఎఫైర్ల గురించి చర్చించే అమెరికాలో ఈ ఫోబియా ఉందని ఇస్మాయిల్ చెప్పారు. పొత్తికడుపు భాగం ఆకర్షణీయంగా లేదనే భయంతో, బాయ్ ఫ్రెండ్ తనను వదిలేస్తాడేమోనన్న ఆందోళనతో ఇలా నగ్న సెల్ఫీలు పోస్టు చేస్తారని, తద్వారా వచ్చే హిట్స్ చూసి ఆత్మవిశ్వాసం పొందుతారని ఆయన తెలిపారు. ముఖం బాలేదన్న కారణంగా ప్లాస్టిక్ సర్జరీలకు మొగ్గుచూపుతున్నట్టు, భవిష్యత్ లో పొత్తికడుపు భాగం బాగాలేదని జెనిటల్ సర్జరీలకు ఈ ట్రెండ్ దారితీసే ప్రమాదం ఉందని ఇస్మాయిల్ ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News