: బీసీసీఐ అధ్యక్ష పదవిలో కొన‌సాగాల‌ని నాపై ఒత్తిడి తెస్తున్నారు: రాజీనామా త‌రువాత‌ శశాంక్ మనోహర్

బీసీసీఐ అధ్యక్ష పదవిలో కొన‌సాగాల‌ని త‌న‌పై ప‌లువురు ఒత్తిడి తెస్తున్న‌ట్లు బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడు శశాంక్ మనోహర్ తెలిపారు. లోధా కమిటీ తీర్పుపై అసంతృప్తితో ఉన్న శశాంక్.. నిన్న బీసీసీఐ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. బీసీసీఐ అధ్య‌క్ష ప‌ద‌వికి గుడ్ బై చెప్పిన అనంత‌రం ఆయ‌న ప‌లు విష‌యాలపై స్పందించారు. ఇప్ప‌ట్లో ప‌ద‌విని వ‌దులు కోవ‌డం ఇష్టంలేద‌ని, అయినా రాజీనామాకే సిద్ధపడ్డానని చెప్పారు. బీసీసీఐ వ‌ర్గాలు కూడా త‌న‌ను ప‌ద‌విలో కొన‌సాగాల‌ని ఒత్తిడి చేస్తున్న‌ట్లు ఆయ‌న అన్నారు. బీసీసీఐలో ఎన్నో సంస్కరణలు తీసుకువ‌చ్చాన‌ని, త‌న‌కు కూడా బోర్డు ఎంతో ఇచ్చింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప‌ద‌విలో ఉండ‌గా బీసీసీఐ ప్ర‌గ‌తి గురించే ఆలోచించేవాడిన‌ని అన్నారు. శ‌శాంక్ రాజీనామా త‌రువాత బీసీసీఐ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో రాజీవ్ శుక్లా, అనురాగ్ ఠాకూర్ పేర్లు విన్పిస్తున్నాయి.

More Telugu News