: జెట్ విమానానికి ఫ్రంట్ వీల్ తెరచుకోని వేళ... స్టూల్ పై ల్యాండింగ్!

అమెరికన్ యుద్ధ నౌక యూఎస్ఎస్ బతాన్ పై ఉన్న జెట్ విమానమది. తన విధుల్లో భాగంగా మెరైన్ క్రాప్స్ పైలట్ కెప్టెన్ విలియమ్ మహోనీ దాన్ని టేకాఫ్ చేశారు. తిరిగి ల్యాండింగ్ సమయంలో దాని ఫ్రంట్ వీల్ తెరచుకోలేదు. ఆ సమయంలో పైలట్ చాకచక్యం పెను ప్రమాదాన్ని తప్పించగా, ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ అవుతోంది. విషయాన్ని ముందే అధికారులకు చెప్పిన మహోనీ, యుద్ధ నౌక మధ్యలో ఓ స్టూల్ ను నిలపాలని కోరారు. దానిపైనే విమానాన్ని ల్యాండ్ చేస్తానని చెప్పారు. నౌక డెక్ పైకి విమానాన్ని తెచ్చి 20 అడుగుల ఎత్తున దాన్ని స్థిరంగా ఉండేలా చూసిన పైలట్, దాన్ని నెమ్మదిగా కిందకు తెచ్చాడు. ల్యాండింగ్ సమయంలో జెట్ కొద్దిగా ఎగిరినట్టు కనిపించినా ముందు భాగం స్టూల్ పై సరిగ్గా ఆగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ దురదృష్టకర ఘటన జరిగితే, నౌక మొత్తాన్నీ క్షణాల్లో ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేసిన అనంతరమే మహోనీ స్టూల్ ల్యాండింగ్ కు అనుమతిచ్చారట.

More Telugu News