: 'బాస్ అంటే మా బాసే బాబూ' అంటున్న చైనా కంపెనీ ఉద్యోగులు!

వారంతా చైనా ప్రముఖ కంపెనీ టీన్స్ గ్రూప్ సేల్స్ విభాగం ఉద్యోగులు... సీన్ కట్ చేస్తే స్పెయిన్ రాజ ప్రాసాదంలో ప్రత్యక్షం. తమ కంపెనీ ఉత్పత్తులను విక్రయించడానికి వారు అంత దూరం వెళ్లలేదు. స్పెయిన్ అందాలను స్వయంగా చూసేందుకు వెళ్లారు. స్పెయిన్ అనే కాదు, ఏటా ఓ కొత్త దేశంలో సందర్శించడం టీన్స్ గ్రూపు సేల్స్ ఉద్యోగులకు అలవాటే. ఆ కంపెనీ యజమాని ఉద్యోగుల పనితీరును మెచ్చి ఇచ్చే కానుక ఇది. గతేడాది 6,400 మంది ఉద్యోగులను ఇలానే ఫ్రాన్స్ తీసుకెళ్లి పండుగ చేసుకున్నారు. తమ గ్రూపునకు చెందిన ఆరోగ్య ఉత్పత్తుల విక్రయ విభాగంలోని ఉద్యోగులను స్పెయిన్ పర్యటనకు తీసుకువచ్చామని, ఇందుకు 80 లక్షల డాలర్ల వ్యయం చేస్తున్నట్టు యాత్రను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ మేనేజర్ జాంగ్ జిలాయ్ వెల్లడించారు. తమ కంపెనీ ఉద్యోగులు స్పెయిన్ చరిత్ర, డిషెస్, సాకర్ ఆటకు ముగ్ధులయ్యారని, వారి ఇష్ట ప్రకారమే ఈ ఏడాది బోనస్ ట్రిప్ కింద స్పెయిన్ కు తీసుకువెళ్లినట్టు కంపెనీ వ్యవస్థాపకుడి కుమారుడు లి జాంగ్ మిన్ తెలిపారు.

More Telugu News