: గ్రాండ్ బ్రహ్మోత్సవం...ఆడియో వేడుక వ్యాఖ్యాత నవదీప్

'బ్రహ్మోత్సవం' ఆడియో వేడుకను భారీ ఎత్తున నిర్వహిస్తున్న నిర్మాత పీవీపీ...రెగ్యులర్ వ్యాఖ్యాతలు సుమ, ఝాన్సీ, ఉదయభాను వంటి వారిని కాదని... కేవలం సినిమా అవార్డు వేడుకలకు మాత్రమే వ్యాఖ్యాతగా పనిచేసే హీరో నవదీప్ ను వ్యాఖ్యాతగా ఏర్పాటు చేయడం విశేషం. పీవీపీ నవదీప్ ను పరిచయం చేసిన సందర్భంగా మాట్లాడుతూ, తాను పిలవగానే సినీ కుటుంబం మొత్తం ఆడియో వేడుకకు రావడం ఆనందం కలిగించిందని అన్నారు. ఈ ఆడియో వేడుక ఆదివారం పెట్టకుండా, శనివారం ఎందుకు పెట్టారంటూ తనను చాలా మంది అడిగారని, వారందరికీ శనివారం పండగ (బ్రహ్మోత్సవం) చేసుకుని, ఆదివారం రెస్టు తీసుకోవాలని చెప్పానని ఆయన చెప్పారు. అనంతరం నవదీప్ మాట్లాడుతూ, సంప్రదాయం ప్రకారం ఆడియో వేడుకను గణేషుడి పాటతో ప్రారంభించామని, పెద్దల దీవెనలు తీసుకోవాలి కనుక తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ గారి దీవెనలతో ప్రారంభిద్దామని చెప్పాడు.

More Telugu News