: భారత్ లోని తమ రాయబారిపై ఆగ్రహించిన నేపాల్ ప్రధాని... రీకాల్!

భారత్ కు నేపాల్ ఒకే ఒక్క నిర్ణయంతో షాకిచ్చింది. అంతే కాకుండా, ఆ నిర్ణయాన్ని ప్రశ్నించిన భారత రాయబారిని 'వెళ్లిపో' అని చెప్పి వివాదానికి ఆజ్యం పోసింది. నేపాల్ భూకంపం సంభవించిన అనంతరం సహాయకచర్యలు చేస్తున్నామన్న పేరుతో బీజేపీ ప్రభుత్వం...సహాయం చేయడం తమ గొప్ప విజయంగా భావిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకుంది. ఇదే సమయంలో చైనా కూడా నేపాల్ కు సహాయం చేసింది. ఆ తరువాత నేపాల్, భారత్ సరిహద్దుల్లో వివాదాలు రేగాయి. వీటిని భారత రాయబారి వెనక వుండి నడిపించారని అక్కడి నేతలు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో సరిహద్దుల నుంచి భారత్ సరకులు రాకపోవడంతో చైనా వందల సంఖ్యల్లో ట్రక్కులతో సరకులు పంపి నేపాలీల మనసులు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో నేపాల్ కు తొట్టతొలి మహిళా అధ్యక్షురాలిగా విద్యాదేవి భండారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెను భారత పర్యటనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆహ్వానించారు. సోమవారం (మే9) నుంచి ఆమె భారత పర్యటన భారత్ లో ప్రారంభం కావాలి. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఆమె రావడమే తరువాయి. ఇంతలో ఆమె భారత పర్యటన రద్దు చేస్తున్నట్టు నేపాల్ ప్రకటించింది. ఇదే విషయాన్ని భారత్ లోని నేపాల్ రాయబారి దీప్ కుమార్ ఉపాధ్యాయకు ప్రధాని కేపీ శర్మ ఓలి ఫోన్ చేసి చెప్పారు. దీంతో 'అలా ఎలా చేస్తారు? కనీసం నాకు మాటమాత్రమైనా చెప్పకుండా ఎందుకు రద్దు చేశారు?' అంటూ ఉపాధ్యాయ నేపాల్ ప్రధానిని నిలదీశారు. సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన దశలో ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం ఏంటని ఆయన అడిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపాల్ ప్రధాని తమ నిర్ణయం నచ్చని పక్షంలో పదవి నుంచి రాజీనామా చేసి, తప్పుకోవాలని సూచించారు. అంతటితో ఆగని ఆయన వెంటనే ఉపాధ్యాయను వెనక్కి పిలిపించేలా కేబినెట్ తీర్మానం చేయించారు. ప్రభుత్వ ఉద్దేశానికి వ్యతిరేకంగా నడుచుకోవడం, ప్రభుత్వాన్ని ఓవర్ టేక్ చేసేలా నడచుకోవడంతోనే ఆయనను వెనక్కి పిలిపిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో భారత్, నేపాల్ సంభంధాలు ఏ మలుపులు తిరగనున్నాయోనని ఆసక్తి రేగుతోంది.

More Telugu News