: ఆ చిన్నారి చేతులకు 15 వేళ్లు, కాళ్లకు 16 వేళ్లు!

చైనాలోని ఒక చిన్నారి చేతులకు, కాళ్లకు ఎక్కువ వేళ్లతో పుట్టాడు. సాధారణంగా ఉండాల్సిన వేళ్ల కన్నా ఎక్కువ వేళ్లతో ఉంటే దాన్ని ‘పాలీ డాక్టలిజమ్’ అని అంటారు. ఈ ఏడాది జనవరిలో హునన్ రాష్ట్రంలోని పింగ్ జాంగ్ జిల్లాలో చిన్నారి హాంగ్ కాంగ్ జన్మించాడు. ఆ చిన్నారికి ప్రతి చేతికి, కాళ్లకు అదనపు వేళ్లు వున్నాయి. ఈ వ్యాధి విషయమై డాక్టర్లు మాట్లాడుతూ, వెయ్యి మందిలో ఒకరు ఈ విధంగా జన్మిస్తారని చెప్పారు. హాంగ్ కాంగ్ జన్మించి నాలుగు నెలలు అవుతోందని, ఆ చిన్నారి తల్లి చేతులకు, కాళ్లకు ఆరు వేళ్లు చొప్పున ఉన్నాయన్నారు. ఈ లక్షణాలు జన్యుపరంగా సంక్రమిస్తాయని, అందుకే, హాంగ్ కాంగ్ అదనపు వేళ్లతో జన్మించాడని చెప్పారు. ఈ సందర్భంగా హాంగ్ కాంగ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ, వైద్యుల సలహా తీసుకుంటున్నామని, చిన్నారికి సర్జరీ చేసి అదనపు వేళ్లు తొలగించడమన్నది కొంచెం కష్టమైందే కాక ఖర్చుతో కూడుకున్నదని చెప్పారన్నారు. తమకు అంత ఆర్థిక స్తోమత లేదని, ఈ నేపథ్యంలో తమకు సహాయమందించాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశామని చిన్నారి తండ్రి షెన్ జెన్ చెప్పారు.

More Telugu News