: నా దృష్టిలో డిజైరబుల్ మహిళకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే...: బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్

ఒక మంచి వాతావరణాన్ని సృష్టించగలిగే మహిళా, నిజాయతీగా ఉండే మహిళ డిజైరబుల్ గా ఉంటుందని బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇండియాలో మోస్ట్ డిజైరబుల్ పర్సన్స్ జాబితాను ప్రతి యేడాది మాదిరిగానే ఈ ఏడాదీ టైమ్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. భారత సెలబ్రిటీల్లో మొత్తం 50 మందిని ఎంపిక చేసి, పాఠకులు ఎవరిని కోరుకుంటున్నారని ప్రశ్నిస్తూ, ఒక పోల్ నిర్వహించింది. ఈ పోల్ లో రణవీర్ సింగ్ తొలి స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. డిజైరబుల్ కు సంబంధించి ఒక వ్యక్తి భౌతిక రూపమనేది చిట్టచివరన నిలిచే అంశమన్నారు. తన మటుకు అయితే, సెన్సాఫ్ హ్యూమర్ కల్గిన, చక్కగా సంభాషించే నైపుణ్యం, తెలివితో పాటు స్పాంటేనియస్ గా స్పందించే మహిళకు డిజైరబుల్ లక్షణాలున్నట్లుగా భావిస్తానన్నారు. మ్యూజిక్, సినిమాలు, క్రీడలను ఎంజాయ్ చేసే మహిళలను తాను ఇష్టపడతానని ఈ ఏడాది 'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్'గా ఎంపికైన రణ్ వీర్ సింగ్ తన మనసులో మాట చెప్పాడు.

More Telugu News