: కొత్త ఆర్డర్లు లేక, ఉత్పత్తి రంగం కుదేలు!

గడచిన ఏప్రిల్ లో ఇండియాలోని పారిశ్రామిక సంస్థలకు కొత్త ఆర్డర్లు కరవవడంతో, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ ఇండెక్స్ దిగజారింది. ఏప్రిల్ నెల పర్చేజింగ్ మేనేజింగ్ ఇండెక్స్, మార్చితో పోలిస్తే 52.4 నుంచి 50.50 శాతానికి పడిపోయింది. గత సంవత్సరం ఏప్రిల్ తో పోలిస్తే ఈ యేడు వృద్ధి స్వల్పమే అయినప్పటికీ, ఉత్పత్తిరంగంలో వరుసగా నాలుగో నెలలో సగటు కన్నా వృద్ధి అధికంగా ఉండటం కొంత మేరకు సంతృప్తికరమేనని నిపుణులు వ్యాఖ్యానించారు. ఎటొచ్చీ ఎగుమతి వ్యాపారం భారీగా దిగజారి ఆరు నెలల కనిష్ఠానికి చేరడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలో కొత్త ఆర్డర్లు మందగించాయని, దీంతో పలు కంపెనీల విస్తరణ ఆగిపోయిందని వివరించారు. కాగా, ఏప్రిల్ లో చైనా ఉత్పత్తి గణాంకాలు సైతం భారత్ నడిచిన దారిలోనే నడిచాయి. మార్చిలో 50.2గా ఉన్న పీఎంఐ, ఏప్రిల్ లో 50.1 శాతానికి తగ్గింది.

More Telugu News