: మన దేశంలో యజమానిగా కంటే, ఆ దేశాల్లో పని వాడిగా ఉండడమే మేలట!

'మేడే'ను పురస్కరించుకుని, కార్మికులకు స్వర్గధామంగా ఉన్న ఐదు దేశాల్లోని కార్మికుల కనీస వేతనాల గురించి తెలుసుకుందాం. లక్సెంబర్గ్ లో కార్మికుల కనీస వేతనం 2029 డాలర్లు. అంటే అక్షరాలా 1,34,774 రూపాయలు. అదే నెదర్లాండ్స్ లో అయితే 1918 డాలర్లు. అంటే మన రూపాయల్లో 1,27,401. ఇక బెల్జియం విషయానికి వస్తే, అక్కడ కార్మికుడు తీసుకునే కనీస వేతనం 1800 డాలర్లు. అంటే 1,19,563 రూపాయలు. ఫ్యాషన్ పుట్టిల్లు ఫ్రాన్స్ లో కార్మికుడి కనీస వేతనం 1707 డాలర్లు అంటే 1,13,385 రూపాయలు. బ్రిటన్ లో కార్మికుడి కనీస వేతనం 1657 డాలర్లు. అంటే 1,10,064 రూపాయలు. కనీస వేతనం మాత్రమే కాకుండా ఇక్కడ పని దినాలు ఐదు మాత్రమే. వీటికి తోడు పెటర్నటీ లీవ్ కూడా దొరుకుతుంది. అనారోగ్యం పాలైతే ఆరోగ్యబీమా, జీవిత బీమా తదితరాలు సరేసరి. రాత్రి పూట పనిచేస్తే డబుల్ జీతం కంటే ఎక్కువ మొత్తాన్ని కార్మికుడికి ముట్టజెపుతారు. ఇన్ని సౌకర్యాలు కలిగిన ఆ దేశాల్లో పని చేసే కార్మికుడి జీవన విధానం, మన దేశంలోని ఓ కంపెనీ యజమాని కంటే ఉత్తమమని పలు నివేదికలు అభిప్రాయపడ్డాయి.

More Telugu News