: దీపికకు హేమమాలిని ఎంగేజ్ మెంట్ శుభాకాంక్షలు...అపార్థం చేసుకున్న అభిమానులు!

బాలీవుడ్ నటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని అనుకున్నదొకటైతే, నెటిజన్లు ఊహించినది మరొక్కటి అయింది. ‘దీపికా, మీ ఎంగేజ్ మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు! మీ ఇద్దరూ సంతోషంగా, ఆనందంగా జీవించడంతో పాటు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ నిన్నటి తరం 'డ్రీం గాళ్' హేమ మాలిని తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేసింది. ఇంకేముంది, ఈ ట్వీట్ వైరల్ అయింది. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే, రణవీర్ సింగ్ ల అభిమానులు పుంఖాను పుంఖాలుగా వాళ్లిద్దరికి ట్వీట్లు పంపారు. వాళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ జరుగుతోందని అనుకుని శుభాకాంక్షలు తెలిపారు. దీంతో, అసలు విషయం తెలుసుకున్న హేమమాలిని కంగారుపడి మరో ట్వీట్ చేసింది. ‘నో నో ! ఈ దీపిక నన్ను ట్విట్టర్ లో ఫాలో అయ్యే అమ్మాయి! దీపికా పదుకొణే కాదండీ బాబూ’ అంటూ ఆ ట్వీట్ లో పేర్కొనడంతో నెటిజన్లకు అసలు విషయం బోధపడింది.

More Telugu News