: ఎవరిపైనా నిషేధం విధించకూడదు.. అది ఆదిమ చ‌ర్య‌: ట‌్రంప్‌పై ప్రియాంక చోప్రా విమ‌ర్శ‌

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం అమెరిక‌న్ టీవీ సీరియ‌ల్‌ ‘క్వాంటికో’ షూటింగ్‌లో బిజీబిజీగా ఉంది. మరోపక్క హాలీవుడ్‌ స్టార్‌ డ్వెయిన్‌ జాన్సన్‌తో కలిసి ‘బేవాచ్‌’ సినిమాలో నటించే అవకాశం సైతం కొట్టేసింది. అయితే, ఈ సుంద‌రి తాజాగా అమెరికా అధ్య‌క్ష ప‌దివి రేసులో ఉన్న అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించింది. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆమె ఘాటుగా స్పందించింది. అమెరికాలోకి ముస్లింల‌ను రానివ్వ‌కుండా నిషేధం విధించాల‌ని ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌ను విమ‌ర్శించింది. ఇటువంటి చ‌ర్య ఆదిమ సంస్కృతేనంటూ మండిప‌డింది. క్లిష్ట‌మైన ఉగ్ర‌వాద నిర్మూల‌నా అంశాన్ని ఓ వ‌ర్గానికి ఆపాదిస్తూ వారిపై నిషేధం విధించ‌డం స‌రైన చ‌ర్య కాద‌ని ట్రంప్ వ్యాఖ్య‌ల‌ను తిప్పి కొట్టింది. ఉగ్ర‌వాదాన్ని నిరోధించే క్ర‌మంలో అమెరికాలో ముస్లింలపై నిషేధం విధించాలనుకోవ‌డం ఆదిమ చ‌ర్య‌గా పేర్కొంది.

More Telugu News