: రాజీ కుదుర్చుకున్న మైక్రోసాఫ్ట్, గూగుల్!

ప్రపంచ టెక్ రంగంలో దిగ్గజ కంపెనీలుగా, పరస్పరం ఎన్నో కేసులు పెట్టుకున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీల మధ్య రాజీ కుదిరింది. ఈ రెండు సంస్థలూ తమ వైఖరిని మార్చుకుంటూ, శాంతి ఒప్పందం చేసుకున్నాయి. భవిష్యత్తులో ఒక సంస్థపై మరో సంస్థ ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించుకున్నాయి. తమ డీల్ లో భాగంగా గూగుల్ పై గతంలో చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోనున్నామని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. న్యాయపరమైన ప్రాధాన్యత కోసమే గూగుల్ తో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది. ఇకపై కేసుల విషయంలో కాకుండా, నాణ్యతతో కూడిన ప్రొడక్టులను అందించడంలో పోటీ పడతామని తెలిపింది. కాగా, ఈ రెండు సంస్థల మధ్య జర్మనీ, అమెరికా తదితర దేశాల్లో 18 కేసులు నడుస్తున్నాయి. పేటెంట్ లకు సంబంధించిన కేసులు సైతం విచారణ దశలో ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫిర్యాదులన్నింటినీ ఇరు కంపెనీలూ వెనక్కి తీసుకునేందుకు నిర్ణయించాయి.

More Telugu News