: చైనాలో యాపిల్ సేవలు నిలిపివేత

చైనాలో యాపిల్ తన సేవలను నిలిపేసింది. అధికారుల ఆదేశాల మేరకు ఐ ట్యూన్స్, సినిమాలు, ఐ బుక్స్ సేవలు అందుబాటులో ఉండవని యాపిల్ తెలిపింది. వీలైనంత త్వరలో వినియోగదారులకు తమ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని యాపిల్ స్పష్టం చేసింది. అమెరికా తరువాత అతి పెద్ద మార్కెట్ కలిగిన చైనాలో సేవల నిలిపివేతకు కారణాలు వెల్లడించకపోవడం విశేషం. చైనాలో విస్తరించిన యాపిల్ సేవలు, ధరలపై చైనా మీడియా పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం దీనిని నియంత్రించే పనిలో పడింది. అందులో భాగంగా ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి సంస్థల సేవలపై కన్నేసి ఉంచి ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ఉంది. సున్నితమైన, హింసాత్మక, నైతికత లేని విషయాలను నియంత్రిస్తున్నామని పేర్కొంటోంది. యాపిల్ కు దీటైన ఫోన్లను చైనా వినియోగదారులు తయారు చేస్తుండడంతో వాటికి మద్దతిచ్చేందుకు చైనా ఇలాంటి నియంత్రణను తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News