: రాడార్లు, సెన్సర్లు పట్టలేని విమానాన్ని విజయవంతంగా పరీక్షించిన జపాన్

ప్రపంచ దేశాల సరిహద్దుల్లో భద్రత పెరుగుతోంది. అయినప్పటికీ పలుదేశాలు అభద్రతా భావంతో ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపధ్యంలో జపాన్ స్టెల్త్ విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది. మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ తయారు చేసిన ఈ స్టెల్త్ విమానం రాడార్లు, సెన్సర్లకు అందదని నిపుణులు తెలిపారు. అంతే కాకుండా ఇది నిట్టనిలువుగా ఆకాశంలోకి దూసుకుపోగల సామర్థ్యం కలిగి ఉందని, పూర్తి అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో తయారైన ఈ విమానం మిసైళ్లను కూడా మోసుకెళ్లగలదని జపాన్ ప్రకటించింది. జెట్ ఫైటర్స్ తో కలిసి ఈ విమానం సేవలందిస్తుందని జపాన్ తెలిపింది. దీని పేరును ఎక్స్-2 గా ఖరారు చేసినట్టు జపాన్ అధికారులు వెల్లడించారు. ఉత్తరకొరియా పలు ఆయుధ పరీక్షలతో నిత్యం రెచ్చగొడుతుండడంతో జపాన్ గట్టిగా సమాధానం చెప్పాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అత్యాధునిక రాడార్లు, సెన్సర్లకు దొరకని విమానం తయారు చేయడం విశేషం.

More Telugu News