: బౌలర్లు ఆకట్టుకున్నారు...బ్యాట్స్ మన్ పనే మిగిలింది!

సన్ రైజర్స్ బెంగళూరు బౌలర్లు రాణించారు. ఐపీఎల్ లో భాగంగా రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు గుజరాత్ లయన్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆదిలోనే ఫాంలో ఉన్న ఆరోన్ ఫించ్ (0) వికెట్ తీసిన భువనేశ్వర్ గుజరాత్ కు షాకిచ్చాడు. మరో ఓపెనర్ మెక్ కల్లమ్ (18) కు జత కలిసిన సురేష్ రైనా (75) చెలరేగాడు. వీరిద్దరూ కుదురుకున్నారనుకునేంతలో బిపుల్ శర్మ మెక్ కల్లమ్ ను పెవిలియన్ కు పంపాడు. దినేష్ కార్తిక్ (8), బ్రావో (8) విఫలమయ్యారు. దీంతో రంగంలోకి దిగిన రవీంద్ర జడేజా (14) కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారీ షాట్లు ఆడలేకపోయాడు. అనంతరం రైనా, నాథ్ (5) ను వరుస బంతుల్లో పెవిలియన్ కు పంపిన భువనేశ్వర్ కుమార్, ఇన్నింగ్స్ చివరి బంతికి డేల్ స్టెయిన్ (1) ను పెవిలియన్ కు పంపాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన గుజరాత్ లయన్స్ జట్టు 135 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాదు బౌలర్లలో 4 వికెట్లు తీసి భువనేశ్వర్ కుమార్ రాణించగా, అతనికి శ్రాన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హుడా, బిపుల్ శర్మ చెరో వికెట్ తీసి సహకారమందించారు. 136 పరుగుల విజయ లక్ష్యంతో సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించనుంది. బౌలర్ల కష్టాన్ని బ్యాట్స్ మన్ నిలబెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

More Telugu News