: అమ్మకాల ఒత్తిడితో తగ్గిపోయిన మార్కెట్ లాభం

సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే, 200 పాయింట్లకు పైగా లాభంలోకి సెన్సెక్స్ సూచిక దూసుకెళ్లిన సమయంలో తాజా గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రయత్నించారు. దీంతో క్రమంగా లాభాలు తగ్గుతూ వచ్చాయి. ఈ ప్రభావం చిన్న, మధ్యతరహా కంపెనీలపై స్పష్టంగా కనిపించడంతో స్మాల్, లార్జ్ కాప్ ఈక్విటీలు భారీగా నష్టపోయాయి. గురువారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 36.20 పాయింట్లు పెరిగి 0.14 శాతం లాభంతో 25,844.18 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 2.70 పాయింట్లు పడిపోయి 0.03 శాతం నష్టంతో 7,912.05 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.50 శాతం, స్మాల్ క్యాప్ 0.52 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 18 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, కోల్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బీపీసీఎల్ తదితర కంపెనీలు లాభపడగా, విప్రో, ఇన్ ఫ్రాటెల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బీహచ్ఈఎల్, ఏసీసీ సిమెంట్స్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,731 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,080 కంపెనీలు లాభాల్లోను, 1,496 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. బుధవారం నాడు రూ. 97,79,523 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 97,58,667 కోట్లకు తగ్గింది.

More Telugu News