: 14 ఏళ్ల తరువాత దారుణంగా పడిపోయిన ఐబీఎం!

ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (ఐబీఎం) ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ సేవల సంస్థ. దాదాపు 14 సంవత్సరాల తరువాత ఈ సంస్థ దారుణంగా నష్టపోయింది. మార్చి 31తో ముగిసిన తొలి త్రైమాసికంలో సంస్థ ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే, 4.6 శాతం తగ్గి 18.68 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ వార్త స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీయగా, ఐబీఎం ఈక్విటీ విలువ ఏకంగా 5 శాతం దిగజారింది. ఐబీఎం ఆదాయం గత నాలుగేళ్లుగా తగ్గుతూ వస్తుండగా, ఇంత ఎక్కువ మొత్తంలో తగ్గడం మాత్రం ఇదే తొలిసారి. సంస్థను తిరిగి నిలిపేందుకు గత సంవత్సరం క్లౌడ్ ఆధారిత సేవలను, డేటా అనలిటిక్స్, సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ సేవలను అందించడం మొదలు పెట్టామని, సంప్రదాయ హార్డ్ వేర్ వ్యాపారాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటున్నామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిన్నీ రోమెట్టీ తెలిపారు. క్లౌడ్ సేవల నుంచి అనుకున్నంత ఆదాయం పొందలేకపోయామని వివరించారు.

More Telugu News