: ఒలింపిక్స్ కు తొలి భారత జిమ్నాస్ట్... చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్

జిమ్నాస్టిక్స్... ఇటీవలి కాలం వరకూ అంతర్జాతీయ వేదికలపై ఇండియాకు ప్రాతినిధ్యమే లేని క్రీడ. చైనీయులు పూర్తి ఆధిపత్యం చూపుతున్న ఆట. ఇప్పుడు పరిస్థితి మారింది. భారత జిమ్నాస్టిక్స్ చరిత్రలో ఓ కొత్త పేజీని లిఖిస్తూ, దీపా కర్మాకర్ ఒపింపిక్స్ కు అర్హత సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. రియోడీజనీరోలో జరిగిన ఫైనల్ క్వాలిఫయర్ పోటీల్లో సత్తా చాటిన 22 ఏళ్ల దీప, రియో ఒలింపిక్స్ కు అర్హత పొందింది. ఆమె మొత్తం 52.698 పాయింట్లు సాధించింది. మొత్తం 14 మంది క్వాలిఫయింగ్ పోటీల్లో హాజరు కాగా, త్రిపురకు చెందిన దీప 5వ స్థానంలో నిలిచింది. కాగా, 2014 కామన్ వెల్త్ గేమ్స్ లో, ఆపై 2015 ఆసియన్ చాంపియన్ షిప్ పోటీల్లో దీపా కర్మాకర్ కు జిమ్నాస్టిక్స్ కాంస్య పతకాలు లభించిన సంగతి తెలిసిందే.

More Telugu News