: బిపాసా బసు పక్కన స్టెప్పులేయనున్న మాజీ క్రికెటర్ శ్రీశాంత్!

ఓ వైపు రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని వెతుక్కుంటూనే, మరోవైపు చిత్ర రంగంపై కన్నేసిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్, మలయాళంలో 'టీమ్-5' పేరిట నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ చేసేందుకు బిపాసా బసుని తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ పాటలో బిపాసాతో కలసి శ్రీశాంత్ డ్యాన్స్ చేయనున్నాడట. తొలుత ఈ పాట కోసం సన్నీ లియాన్ ను సంప్రదించగా, ఆమె రూ. 1 కోటి డిమాండ్ చేసినట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి. అంతమొత్తాన్ని భరించలేమంటూ, వెనక్కు తగ్గిన నిర్మాతలు బిపాసాను సంప్రదించినట్టు సమాచారం. ఇక త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న బిపాసా ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించిందా? లేదా? అన్నది తెలియరాలేదు.

More Telugu News