: క్వాడ్, అక్టాలు పోయాయి... డెకా కోర్ ప్రాసెసర్ తో వచ్చేసిన తొలి స్మార్ట్ ఫోన్

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మరింత వేగవంతంగా పనిచేసే స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్లు వస్తున్నాయి. ఇప్పటివరకూ డ్యూయల్ కోర్, క్వాడ్ కోర్, ఆక్టా కోర్ ప్రాసెసర్లతో స్మార్ట్ ఫోన్లు రాగా, తాజాగా చైనా సంస్థ మైజూ డెకా కోర్ (10 కోర్) ప్రాసెసర్, 3డీ టచ్, 4 జీబీ రామ్ సదుపాయాలతో ఫోన్ ను మైజూ ప్రో6 పేరిట విడుదల చేసింది. ప్రపంచంలో డెకా కోర్ ప్రాసెసర్ తో తయారైన తొలి ఫోన్ ఇదే కావడం గమనార్హం. 5.2 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 32/64 జీబీ సామర్థ్యం, 21 మెగాపిక్సల్ కెమెరా, 4జీ సపోర్టుతో లభించే ఫోన్ ధర రూ. 25,719 (32 చీబీ) నుంచి రూ. 28,807 (64 జీబీ) మధ్య లభిస్తుంది. కేవలం గంటసేపు చార్జింగ్ పెడితే బ్యాటరీ 0 నుంచి 100 శాతానికి చేరేలా ఎంచార్జ్ 3.0 టెక్నాలజీ ఈ స్మార్ట్ ఫోన్ మరో ప్రత్యేకత.

More Telugu News