: ప్రయోగాలలో తండ్రికి తగ్గ తనయుడు నాగార్జున: సిరివెన్నెల

దిగ్గజ నటులు అక్కినేని నాగేశ్వరరావు తన నటజీవితంలో ఎన్ని ప్రయోగాలు చేశారో...తన కెరీర్ లో అన్ని ప్రయోగాలు చేసి అక్కినేని నాగార్జున తండ్రికి తగ్గ తనయుడనిపించారని ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. 'ఊపిరి' సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, 'గీతాంజలి' నుంచి 'ఊపిరి' వరకు ఆయన చెయ్యని జానర్ లేదని అన్నారు. ఈ సినిమా మాతృక 'ఇన్ టచ్ బుల్స్' ను తాను చూశానని, రీమేక్ అనగానే దానిని మక్కీకి మక్కీ అనువదించే దర్శకులున్న ఈ రోజుల్లో 'ఊపిరి'ని ఫ్రీమేక్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తీర్చిదిద్దారని ఆయన కితాబునిచ్చారు. మాతృకను అనుసరించకుండా తెలుగు నేటివిటీకి అనుగుణంగా నైపుణ్యంతో తీర్చిదిద్దారని ఆయన కొనియాడారు. ఇలాంటి కథను తీసేందుకు నిర్మాతకు ఎంతో ధైర్యం కావాలని, అలాంటి తెగువ చూపిన పీవీపీని శాస్త్రి అభినందించారు.

More Telugu News