: 'వీరూ' ఎత్తిపొడుపు...షోయబ్ మన్నింపు!

గతంలో టీమిండియా వెటరన్ వీరేంద్ర సెహ్వాగ్ కు పాకిస్థాన్ వెటరన్ షోయబ్ అక్తర్ మధ్య ధనాధన్ వైరం నడిచింది. అయితే, ఆమధ్య సచిన్ అమెరికాలో నిర్వహించిన ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీలో ఆడిన దగ్గర్నుంచి వీరి మధ్య స్నేహ బంధం చిగురించింది. ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా మెలుగుతున్నారు. వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటప్పుడు... వీరూ ఏదైనా అంటే 'చిన్నాడివి కదా నోటిదురుసు ఉంటుంది, పర్లేదులే' అని షోయబ్ అంటే...షోయబ్ ఏదైనా దూకుడు వ్యాఖ్య చేస్తే 'పెద్దాడివి, అన్న లాంటి వాడివి. ఆ మాత్రం అనే స్వేచ్ఛ నీకు ఉంది పర్లేదులే' అని సెహ్వాగ్ స్పోర్టివ్ గా తీసుకుంటాడు. తాజాగా సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నీలో పాకిస్థాన్ ను భారత జట్టు 1-5 తేడాతో ఓడించింది. దీనిపై సెహ్వాగ్...'షోయబ్ భాయ్...మళ్లీ మోకా మీ చేజారింది...హాకీలో కూడా మీ జట్టు ఓడిపోయింది'. అని ట్వీట్ చేశాడు. 'మోకా' అంటే టీవీల్లో వరల్డ్ కప్ వచ్చిన ప్రతిసారీ ఓ పాకిస్థాన్ అభిమాని భారత్ పై 'పాక్ జట్టు గెలుస్తుంది, సంబరాలు చేసుకుంటా'నంటూ టపాసుల పెట్టె తీసుకుని ఉత్సాహంగా టీవీ ముందు కూర్చుంటాడు. పాక్ ఓటమిపాలు కావడంతో నిరాశగా వాటిని మళ్లీ దాచేస్తాడు. ఈ యాడ్ ను గుర్తు చేస్తూ, పాకిస్థాన్ జట్టు ఓటమిని సెహ్వాగ్ ఎత్తిపొడిచాడు. దీనికి షోయబ్ బదులిస్తూ...'నా సోదరుడు వీరూ ఏమన్నా క్షమిస్తాను...ఎందుకంటే అతని మనసు బంగారం...అతను చెడుగా ఎప్పుడూ మాట్లాడడు. సరదాగా మాట్లాడుతాడు' అని ట్వీట్ చేశాడు. వీరి సంభాషణ క్రీడా ప్రేమికులను ఆకట్టుకుంటోంది.

More Telugu News