: బాహుబలి, కట్టప్ప స్టోరీకి ట్విస్టిచ్చిన రాజమౌళి తండ్రి!

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? గత సంవత్సరంలో రాజమౌళి విడుదల చేసిన 'బాహుబలి: ది బిగినింగ్' విడుదలైన నాటి నుంచి ప్రేక్షకుల మెదళ్లను తినేసిన ప్రశ్న ఇది. ఈ చిత్రానికి కథను అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలి, కట్టప్పల కథకు మరో ట్విస్టిచ్చారు. అంతగా అభిమానించే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ ప్రశ్నించగా, "బాహుబలి హత్యకు గురయ్యాడని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన బతికే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ స్టోరీని బాహుబలి తొలి భాగం విడుదలకు ముందే పూర్తి చేశాను" అని చెప్పారు. దీంతో బాహుబలి మరణించాడని భావిస్తున్న ప్రపంచ సినీ ప్రేక్షకులు మరింత సస్పెన్స్ లో పడ్డారు.

More Telugu News