: ద్రవిడ్ ఒప్పుకోలేదట...మళ్లీ రవిశాస్త్రే!

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ను నియమించాలని పేర్కొంటూ సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన బీసీసీఐ అత్యున్నత సలహాదారుల కమిటీ సూచించిందన్న వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ టీమిండియా కోచ్ కానున్నాడని అతని అభిమానులంతా సంబరపడిపోయారు. అయితే కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు ఇది సరైన సమయం కాదని ద్రవిడ్ భావిస్తున్నాడు. ఇప్పటికే ఇండియా-ఏ, అండర్ 19 జట్ల కోచ్ గా తను రాణిస్తున్నాడు. ఈ సమయంలో టీమిండియా కోచ్ వంటి బరువైన బాధ్యతను తలకెత్తుకోవడానికి అతను సిద్ధంగా లేడు. దీనికి మరికొంత సమయం కావాలని తాను కోరుకుంటున్నాడు. ఇదే విషయాన్ని సలహా కమిటీకి కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో విదేశీ కోచ్ కంటే ఇప్పటి వరకు డైరెక్టర్ గా ప్రభావం చూపిన రవిశాస్త్రినే కోచ్ గా వినియోగించుకోవాలని ఈ కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో రవిశాస్త్రిని కోచ్ గా నియమించడంపై బీసీసీఐకి సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. రవిశాస్త్రిని కోచ్ గా నియమిస్తూ మరో మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

More Telugu News