: రికార్డు స్థాయికి పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు

ఏప్రిల్ 1తో ముగిసిన వారాంతానికి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 4.2 బిలియన్ డాలర్లు పెరిగి 359.7 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇదే సమయంలో ఎఫ్సీఏ (ఫారిన్ కరెన్సీ అసెట్స్) 3.5 బిలియన్ డాలర్లు పెరిగి 335.6 బిలియన్ డాలర్లకు చేరాయని తెలిపింది. బంగారం నిల్వలు మరో 789 మి. డాలర్లు పెరిగి 20.115 బిలియన్ డాలర్లకు పెరిగాయని, అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద, భారత ప్రత్యేక విత్ డ్రా హక్కుగా ఉన్న మొత్తం 1.5 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్బీఐ ప్రకటించింది.

More Telugu News