: రాణించిన హర్భజన్, రాయుడు...పూణే లక్ష్యం 122

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ముంబై పేలవమైన ఆటతీరుతో అభిమానులను నిరాశపరిచింది. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ పై ముంబై ఇండియన్స్ చతికిలపడ్డారు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన రోహిత్ శర్మ (7) ను ఇషాంత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు పంపాడు. అనంతరం సిమ్మన్స్ (8)ను మరో అద్భుతమైన బంతికి బౌల్డ్ చేశాడు. దీంతో 29 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హార్డిక్ పాండ్య (9)ను పెవిలియన్ కు పంపిన మార్ష్ తరువాతి బంతికి బట్లర్ (0) ను బలిగొన్నాడు. అనంతరం దిగిన పొలార్డ్ (1)ను భాటియా అవుట్ చేశాడు. దీంతో 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ జట్టు కష్టాల్లో పడింది. దీంతో అంబటి రాయుడు (22) ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. యస్.గోపాల్ (2) విఫలమయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హర్భజన్ సింగ్ (45) రాణించాడు. భారీ షాట్లతో అభిమానులను అలరించాడు. అతనికి వినయ్ కుమార్ (12) సహకారమందించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ జట్టు బౌలర్లలో ఇషాంత్ శర్మ, మిచెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు తీయగా భాటియా, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, ఆర్పీ సింగ్ చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు. 122 పరుగుల విజయలక్ష్యంతో పూణే బ్యాటింగ్ ప్రారంభించనుంది.

More Telugu News