: విదేశీ కోచ్ కావాలనుకున్నప్పుడు నన్ను ఎందుకు అడిగారు?: పాక్ మాజీ ఆటగాడు అకీబ్ జావెద్

విదేశీ కోచ్ కావాలని భావించినప్పుడు తనను సంప్రదించడం ఎందుకని పాక్ మాజీ ఆటగాడు అకీబ్ జావెద్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ప్రశ్నిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ వైఫల్యంతో పాక్ జట్టుకు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ, కోచ్ వకార్ యూనిస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త కోచ్ కోసం పీసీబీ వేట మొదలు పెట్టింది. దేశీ భావాలతో ఉండే పీసీబీ మాజీ ఆటగాడు అకీబ్ జావెద్ ను సంప్రదించింది. దీనికి అతను కూడా అంగీకారం తెలిపాడు. అయితే ఈ మధ్య కాలంలో భారీ టోర్నీలు లేకపోవడంతో జట్టును గాడినపెట్టాలని పీసీబీ భావిస్తోంది. అలా చేయాలంటే దేశీ కోచ్ కంటే వీదేశీ కోచ్ అయితే కాస్త ఫలితం ఉంటుందని సెలక్షన్ కమిటీలోని వసీం అక్రమ్, రమీజ్ రాజా భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అకీబ్ ఇప్పుడు మండిపడుతున్నాడు. విదేశీ కోచ్ కోసం ఆసక్తి ప్రదర్శించేటప్పుడు తనను ఎందుకు సంప్రదించారని నిలదీశాడు.

More Telugu News