: సెల్ఫీలు పెట్టేవారు, పక్క సెల్ఫీలు చూడరట!

ఇది సెల్ఫీల యుగం. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా, సెల్ఫీలు తీసుకుని, వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడుతూ, ఎన్ని లైకులు వచ్చాయో చూసి మురిసిపోతుండే యువతీ యువకులు ఎందరో. ఈ నేపథ్యంలో అసలు సెల్ఫీలు పెడుతుండే వారి మనోభావాలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో దక్షిణ కొరియాకు చెందిన కొరియా యూనివర్శిటీ ఓ ప్రత్యేక అధ్యయనాన్ని చేసింది. ఈ అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర అంశం ఏంటంటే, అహంకార పూరిత వ్యక్తులే సామాజిక మాధ్యమాల్లో అధికంగా సెల్ఫీలు పెడుతున్నారట. తమ సెల్ఫీలకు వచ్చే కామెంట్లను చూసేందుకు ఇష్టపడే వీరు, తమ స్నేహితుల జాబితాలోని వ్యక్తులు పెట్టే సెల్ఫీలను మాత్రం పట్టించుకోరట. ప్రశాంతంగా ఉండేవారు పెడుతున్న సెల్ఫీల సంఖ్య తక్కువేనని కూడా అధ్యయనం వెల్లడించింది.

More Telugu News