: ప్రత్యూష కేసులో నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?: ముంబై పోలీసులపై రాఖీ సావంత్ ఫైర్

'బాలికావధు' సీరియల్ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఇంతవరకు నిందితుడ్ని ఎందుకు అరెస్టు చేయలేదని బాలీవుడ్ ఐటెం క్వీన్ రాఖీ సావంత్ ముంబై పోలీసులపై నిప్పులు చెరిగింది. రాహుల్ రాజ్ సింగ్ ఆమెను హత్య చేశాడని చెప్పడానికి సవాలక్ష కారణాలు కనబడుతున్నా పోలీసులు అరెస్టు చేయడం లేదని ఆమె మండిపడింది. ప్రత్యూష ఊపిరాడక చనిపోయినట్టయితే... ఆమె ముఖం మీద ఏర్పడ్డ గాయాలకు కారణాలు ఏంటని ఆమె నిలదీసింది. ప్రత్యూష ప్రియుడు అంత షాక్ కు గురైతే...ఆమె భౌతిక కాయాన్ని ఆసుపత్రిలో చేర్చి, ఆమె ఫోన్ పట్టుకుని ఎందుకు వెళ్లిపోయాడని ఆమె నిలదీసింది. రాహుల్ రాజ్ సింగ్ ప్రియురాలు ప్రత్యూషకు పంపిన వీడియోలు ఆ మొబైల్ లో ఉన్నాయని రాఖీ సావంత్ తెలిపింది. రాహుల్ రాజ్ నిజాలు అంగీకరించి పోలీసులకు లొంగిపోతే బాగుండేదని, ఇప్పుడు షాక్ అంటూ నాటకాలు ఆడుతున్నాడని రాఖీ సావంత్ తెలిపింది. ఇలా ఎంత మంది నటీమణులను బలితీసుకుంటారని ఆమె ప్రశ్నించింది. పోలీసులు రాహుల్ ను ఎందుకు అదుపులోకి తీసుకోలేదో తనకు అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలీసులు ఇంతవరకు ఆమె మొబైల్ ను స్వాధీనం చేసుకోకుండా ఉండడంలో ఉద్దేశం ఏంటని ఆమె అడిగింది. పోలీసులు కావాలనే ఆమె కేసును ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె తెలిపింది. ప్రత్యూష కుటుంబానికి 5 కోట్ల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని రాఖీ సావంత్ డిమాండ్ చేసింది.

More Telugu News