: గవాస్కరుకు అంతిచ్చుకోలేక వదిలించుకోనున్న బీసీసీఐ!

దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్, ఆపై టీమిండియాకు వివిధ రూపాల్లో సేవలందిస్తున్న సునీల్ గవాస్కరును ఇక వదిలించుకోవాలని బీసీసీఐ భావిస్తోందా? ఈ నెలలో కాంట్రాక్టు ముగియనుండటంతో, ఆయన్నిక భరించలేమని బీసీసీఐ బోర్డు వర్గాలు వ్యాఖ్యానించాయి. ఫీజు రూపంలో గవాస్కరుకు ఇచ్చే మొత్తం అధికమని అనుకొంటున్న బీసీసీఐ పెద్దలు, సంజయ్ మంజ్రేకర్ లేదా హర్షా భోగ్లేలలో ఒకరికి ప్రమోషన్ ఇవ్వాలని భావిస్తున్నట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా, కామెంటేటర్లకు రోజుకు రూ. 35 వేల నుంచి రూ. 1 లక్షల వరకూ ఇస్తున్న బీసీసీఐ, గవాస్కర్ కామెంట్రీ చెబితే మాత్రం 8 రెట్లు అధికంగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక గవాస్కరును తప్పిస్తే, ఆయన స్థానంలో రవిశాస్త్రిని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని, ఆయన అంగీకరించకుంటే మంజ్రేకర్, హర్షల్లో ఒకరికి చాన్స్ దక్కవచ్చని సమాచారం.

More Telugu News