: టైటిల్ విండీస్ దే!... ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మాత్రం కోహ్లీది!

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీ ముగిసింది. అన్ని జట్లకు, ప్రత్యేకించి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియాకు షాకిచ్చిన వెస్టిండీస్ జట్టు విజేతగా నిలిచింది. పురుషుల జట్టుతో పాటు ఆ దేశ మహిళల జట్టు కూడా విజేతగా నిలవడంతో... ఒకే ఏడాది రెండు కప్ లను వెస్టిండీస్ ఎగరేసుకుపోయింది. వెస్టిండీస్ జట్టుతో పాటు ఇంగ్లండ్, న్యూజిల్యాండ్... తదితర జట్లకు చెందిన పలువురు ప్లేయర్లు బాగా రాణించారు. అయితే ఏ ఒక్కరి ప్రదర్శన టీమిండియా చిచ్చర పిడుగు, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఆట తీరుకు సరి రాలేదు. లీగ్ దశలో నాలుగు మ్యాచ్ లతో పాటు ఓ సెమీ ఫైనల్... వెరసి సిరీస్ లో మొత్తం ఐదు మ్యాచ్ లలో కోహ్లీ ఏకంగా 273 పరుగులు సాధించాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు ఉండటం గమనార్హం. నిన్న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ప్రజంటేషన్ సెరెమొనీలో భాగంగా కోహ్లీకి టోర్నీ నిర్వాహకులు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు ప్రకటించారు. అయితే ఆ సమయంలో కోహ్లీ అక్కడ లేకపోవడంతో అతడి తరఫున టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆ అవార్డును అందుకున్నాడు.

More Telugu News