: సన్ స్క్రీన్ లోషన్లు వాడే పురుషులు 'అటూ ఇటూ' కాకుండా పోతారట!

వేసవిలో సూర్యుడి నుంచి వెలువడే మరింత తీవ్రమైన అతి నీలలోహిత కిరణాల బారిన పడకుండా ఉండేందుకు సన్ స్క్రీన్ లోషన్లు వాడుతున్నారా? ఈ తరహా లోషన్లు వాడుతున్న పురుషులకు ఇది కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఎందుకంటే, సన్ స్క్రీన్ లోషన్లతో పాటు మేకప్ సామాన్లను, వివిధ రకాల మాయిశ్చరైజర్లను వాడేవాళ్లు నపుంసకత్వం బారిన పడే ప్రమాదం ఉందని డెన్మార్క్ లోని కోపెన్ హెగన్ యూనివర్శిటీ పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన్నారు. అల్ట్రా వయిలెట్ కిరణాలను తగ్గించే ఈ తరహా లోషన్లు, క్రీముల వల్ల వీర్య కణాల నాణ్యత దెబ్బతింటుందని, ఇవి మహిళల్లో ఉండే ప్రొజెస్టిరాన్ హార్మోన్ల తరహాలో పనిచేసి, పురుషులను 'అటూ ఇటూ' కాకుండా చేస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సో... వీటిని వాడేవారు ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.

More Telugu News