: ఈడీకి ఝలక్కిచ్చిన లిక్కర్ కింగ్!... మే నెల దాకా రాలేనని సమాచారం

వేల కోట్ల రూపాయల రుణాన్ని చెల్లించకుండా లండన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా 17 బ్యాంకులకు షాకిచ్చారు. తాజాగా ఆయన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు కూడా ఝలక్కిచ్చారు. మాల్యా సంస్థకు ఐడీబీఐ ఇచ్చిన రుణానికి సంబంధించిన వ్యవహారంలో జరుగుతున్న విచారణలో భాగంగా తమ ముందు హాజరుకావాలని ఇదివరకే ఈడీ మాల్యాకు నోటీసులు జారీ చేసింది. సదరు నోటీసుల ప్రకారం మాల్యా ఈ రోజు (ఏప్రిల్ 2) ఈడీ అధికారుల ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే ఈ నోటీసులను బేఖాతరు చేసిన మాల్యా... తాను విచారణకు రాలేనని తేల్చిచెప్పేశారు. అంతేకాకుండా ఇప్పుడిప్పుడే తాను విచారణకు రాలేనని, మే నెలలో అయితే చూద్దామంటూ ఈడీకి సమాచారం పంపారట. ఈ విషయాన్ని ఈడీ అధికారులు కూడా నిన్ననే ధ్రువీకరించారు. సాధారణంగా విచారణ తేదీలను దర్యాప్తు సంస్థలు నిర్దేశించాల్సి ఉండగా, మాల్యా విషయంలో మాత్రం ఆయన చెప్పిన ప్రకారం తేదీలను మార్చాల్సిరావడంతో ఈడీ అధికారులు లోలోపలే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News