: వివాదాస్పదమైన మెస్సీ బూట్ల విరాళం

ప్రపంచ ఫుట్ బాల్ లో లియొనెల్ మెస్సీకి ఎంతో పేరుంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమాన గణాన్ని సంపాదించుకున్న మెస్సీ తాజాగా ఎంబీసీ అనే సంస్థ ఈజిప్టులో నిర్వహించిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆ సంస్థ సేకరిస్తున్న నిధులకు తోడుగా తన బూట్లను ఇస్తానని ప్రకటించాడు. ఇదే వివాదాస్పదమైంది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన మోనాఎల్ షార్క్వా ఎరుపు, తెలుపు రంగులు కలిగిన బూట్లను చూపిస్తూ, మెస్సీ ప్రపంచ వ్యాప్తంగా విరాళాలు ఇస్తుంటారు. ఈజిప్టుకు ఆయన బూట్లను ఇచ్చారు. వీటిని వేలం వేస్తామని అన్నారు. దీంతో ఇది వివాదానికి కారణమైంది. ఏడు వేల సంవత్సరాల ఈజిప్టు చరిత్రలో ఇంత పెద్ద అవమానం ఎప్పుడూ ఎదురుకాలేదని ఈజిప్టు పార్లమెంటేరియన్ హసస్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బూట్లను అతని వద్దే ఉంచుకోమనండి...అర్జెంటీనా అభివృద్ధికి వాటి లేస్ లు ఇచ్చుకోమనండని ఆయన సూచించారు. అరబ్ సంస్కృతిలో బూట్లకు ఏ విలువా లేదు. బూట్లు నేలను తాకుతుంటాయి కనుక వాటిని నీచంగా చూస్తారు. దీంతో బూట్లను విరాళంగా ఇవ్వడంపై పలువురు ఈజిప్షియన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

More Telugu News