: తాజా అధ్యయనం... పొద్దునే టిఫిన్ తినడం తప్పనిసరేం కాదు!

ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత శరీరంలో జీవక్రియలను తిరిగి మేల్కొలిపేందుకు అల్పాహారాన్ని స్వీకరించాలని ఇప్పటివరకూ ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాటలు తప్పని బాత్ యూనివర్శిటీ న్యూట్రిషన్ ఎక్స్ పర్ట్ డాక్టర్ జేమ్స్ బెట్స్ అంటున్నారు. అల్పాహారం తప్పనిసరి అని చెప్పడానికి ఏ విధమైన సైంటిఫిక్ ఆధారాలు లేవని ఆయన అన్నారు. తాము చేసిన అధ్యయనంలో బ్రేక్ ఫాస్ట్ కారణంగా శరీరానికి కలిగే ప్రయోజనాలు పెద్దగా లేవని వెల్లడైందని, తమ అధ్యయన ఫలితాలతో ఆశ్చర్యపోయామని ఆయన అన్నారు. వ్యక్తి ఆరోగ్యానికి అల్పాహారం ముఖ్యమనడానికి చాలా తక్కువ ఆధారాలు మాత్రమే లభించాయని ఆయన అన్నారు. ఈ మేరకు జేమ్స్ నేతృత్వంలోని రీసెర్చర్ల బృందం జరిపిన అధ్యయనం వివరాలు 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమయ్యాయి. మొత్తం 70 మందిపై తాము పరిశోధనలు జరిపినట్టు ఈ సందర్భంగా జేమ్స్ వ్యాఖ్యానించారు.

More Telugu News