: అలా మెరిసి... ఇలా పతనమైన శ్రీలంక...ఆకట్టుకున్న సఫారీలు

మొహాలీ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్ లో శ్రీలంక జట్టు ఒక్కసారిగా మెరిసి పతనమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టుకు ఓపెనర్లు దిల్షాన్ (36), చండిమాల్ (21) ధాటిగా ఆరంభం ఇచ్చారు. వీరిద్దరి ధాటికి శ్రీలంక జట్టు కేవలం 6.3 ఓవర్లలో 50 పరుగుల మార్కు దాటింది. చండిమాల్ ను టర్న్ లేని బంతికి బలితీసుకున్న ఫంగిసో...మరుసటి బంతికి తిరుమన్నెను పెవిలియన్ కు పంపాడు. సమన్వయ లోపంతో తిరుమన్నె (15) రనౌట్ గా వెనుదిరిగాడు. దీంతో లంకేయులకు కష్టాలు మొదలయ్యాయి. జయసూరియ (1)ను బెహర్డిన్ అవుట్ చేశాడు. ఆ తరువాత కాసేపటికే దిల్షాన్ ను కూడా పెవిలియన్ పంపాడు. వెంటనే కపుగెదర (4), పెరీరా (8) అవుటయ్యారు. దీంతో క్రీజులోకి వచ్చిన శనక (20) ఆచితూచి ఆడి ఆకట్టుకున్నాడు. హెరాత్ (2), వెనడర్సే(3), లక్మల్ (0) వరుసగా ఔటయ్యారు. దీంతో శ్రీలంక జట్టు 19.2 ఓవర్లలో 120 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో అబోట్, ఫంగిసో, బెహర్డిన్ చెరో రెండు వికెట్లు తీసి రాణించగా, స్టెయిన్, తాహిర్ చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు. 121 పరుగుల విజయ లక్ష్యంతో సఫారీలు బ్యాటింగ్ ప్రారంభించనున్నారు.

More Telugu News