: రెండు బంతులు, రెండు వికెట్లు...ఫంగిసో మ్యాజిక్!

వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి సఫారీ స్పిన్నర్ ఫంగిసో మ్యాచ్ ను కీలక మలుపుతిప్పాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టు ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. దీంతో ఓపెనర్ చండిమాల్ (21) ధాటిగా ఆడడం ప్రారంభించాడు. భారీ షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్ కు ఊపుతెచ్చాడు. అతనికి దిల్షాన్ (25) చక్కని సహకారమందిస్తున్నాడు. స్టెయిన్, అబోట్ ల ద్వయం లంకేయులపై ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో డివిలియర్స్ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. దీంతో ఫంగిసోకు బంతి అందించాడు. ఫోర్ కొట్టడంతో అతనికి స్వాగతం పలికిన దిల్షాన్, తరువాతి బంతికి సిక్సర్ కొట్టాడు. ఈ ఓవర్ లో ఐదవ బంతిని మ్యాజికల్ గా తక్కువ టర్న్ చేసిన ఫంగిసో ఫలితం రాబట్టాడు. చండిమాల్ ను పెవిలియన్ చేర్చాడు. తరువాతి బంతికి అద్భుతమైన టర్న్ రాబట్టిన ఫంగిసో ఫస్ట్ డౌన్ లో దిగిన తిరుమన్నెను అవుట్ చేశాడు. దీంతో శ్రీలంక ఆటగాళ్లు జాగ్రత్తగా ఆడడం ప్రారంభించారు. తొలి ఐదు ఓవర్లు దూకుడుగా ఆడిన శ్రీలంక జట్టు 8 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. క్రీజులో దిల్షాన్ కు జతగా సరివర్దనే (9) ఉన్నాడు.

More Telugu News